నల్లగొండ క్రైం: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. పలువురు ఎస్‌ఐలను వీఆర్‌లో ఉంచగా.. మరికొంత మందిని ప్రాధాన్యత లేని స్థానాలకు పంపించారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన నల్లగొండ జిల్లా హాలియా ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, వాడపల్లి ఎస్‌ఐ రవిని వీఆర్‌లో ఉంచుతూ మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కొండమల్లేపల్లి హోంగార్డు యాదగిరిని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశా రు. అంతేకాకుండా వారం, పది రోజుల క్రితం సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్ ఎస్‌ఐలను వీఆర్‌లో ఉంచారు. అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూరు, మాడ్గులపల్లి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం ఎస్‌ఐలకు స్థాన చలనం కల్పించారు. కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉండటంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయాలి...
రేషన్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైతే సంబంధిత పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిఘా వర్గాల నివేదిక, ఇతర సమాచారం ఆధారంగా పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఫ తాజాగా ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు..
ఫ హెడ్‌క్వార్టర్‌కు ఓ హోంగార్డు అటాచ్
ఫ మల్టీజోన్–2 ఐజీ ఉత్తర్వులు జారీ
ఫ పది రోజుల క్రితం వీఆర్‌కు
ముగ్గురు ఎస్‌ఐలు
ఫ మరో 9మంది ఎస్‌ఐలకు స్థాన చలనం
Comments
Please login to add a commentAdd a comment