సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
మద్దిరాల : ఫ్యామిలీ డిజిటల్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల పరిధి రామచంద్రపురం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామంలో మొత్తం 158 ఇళ్లు ఉన్నాయని, ఐదు బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి బృందంలో నలుగురు అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రజలు ఆధార్‌కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు చూపించి సర్వేలో వివరాల నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో సర్వే జరుగుతున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. దాదాపు 83 కుటుంబాల సర్వే పూర్తి చేశారని, శుక్రవారం వరకు సర్వే పూర్తి చేస్తాుని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అప్పారావు, తహసీల్దార్ అమీన్‌సింగ్ ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి పుష్ప, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment