ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని గడ్డిపల్లి ఎస్‌బీఐ మేనేజర్ ఎంకే సుకుమార్ అన్నారు.
- 8లో
యువత ఉపాధికి తోడ్పాటు
హుజూర్‌నగర్ : యువత ఉపాధికి తోడ్పాటు అందించేందుకు హుజూర్‌నగర్‌కు పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)ను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేయించారు. నూతన ఐటీఐకి రూ.14.35 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఎం ఎంఎస్ నంబర్ 13 విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటు చేయబోయే ఈ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్, డీజిల్ మెకానిక్ కోర్సులతోపాటు వెల్డర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం ఐదు కోర్సుల్లో 216 మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఐటీఐకి ప్రిన్సిపాల్‌తో సహా 8 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలం నుంచి కోరుకుంటున్న ఐటీఐని మంజూరు చేయడంతోపాటు, శాశ్వత భవన నిర్మాణానికి రూ 14.35 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో తాను మంజూరు చేయించిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)కు సమీపంలో రామస్వామి గుట్ట వద్ద కొత్తగా మంజూరైన ఐటీఐని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు.
ఫ హుజూర్‌నగర్‌కు ఐటీఐ మంజూరు
ఫ భవన నిర్మాణానికి రూ.14.35 కోట్లు విడుదల
ఫ ఐదు కోర్సుల్లో 216 మందికి అవకాశం
Comments
Please login to add a commentAdd a comment