బత్తాయి తోటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
గుర్రంపోడు : తిరుపతి యూనివర్సిటీ అందించిన అంటు మొక్కలు నాటిన తోటల్లో నాణ్యతాలోపాలు పరిశీలించేందుకు నాగ్‌పూర్ శాస్త్రవేత్తల బృందం గురువారం గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామంలో గల బత్తాయి తోటలను పరిశీలించారు. తిరుపతి యూనివర్సిటీ రంగాపూర్ బత్తాయి అంటు మొక్కల్లో నాణ్యత లోపించి నష్టపోయామని పలువురు రైతులు ఇటీవల ఉద్యానవన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగపూర్ శాస్త్రవేత్తల బృందం మూడు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాధిత రైతుల తోటలను పరిశీలించి వివరాలు సేకరించింది. బత్తాయి కాయ సైజు తగ్గిపోవడంతోపాటు, క్షీణించిపోవడం, పక్వానికి రాకముందే రాలిపోతున్నాయని రైతులు శాస్త్రవేత్తలకు వివరించారు. అంటు మొక్కల నాణ్యతను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తేల్చాలని శాస్త్రవేత్తలను కోరారు. రైతులు సాగు చేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కొత్తగా కొన్ని రకాల బ్యాక్టీరియాల ద్వారా తెగుళ్లు సోకుతున్నట్లు గుర్తించామన్నారు. యూనివర్సిటీ ల్యాబ్‌లలో పరిశీలించి నివారణ మందులు సూచిస్తామన్నారు. బత్తాయి మొక్కల ఆకులు, కాయలు, మట్టిని శాస్త్రవేత్తలు సేకరించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత లోపాల కారణాలను నిర్దారించి ప్రభుత్వానికి నివేదించడంతోపాటు రైతులకు సరైన దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ ఉద్యానవన శాస్త్రవేత్తలు డాక్టర్ దర్సన్ కడెం, నరేష్, తిరుగునాన్నావెల్, కిరణ్‌కుమార్, వెంకట్, రమేష్, సురేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ బాబు, జిల్లా ఉద్యానవన అధికారి సాయిబాబా, హాలియా, నకిరేకల్ ఉద్యానవన శాఖ అధికారులు మురళి, అనంతరెడ్డి, రైతులు గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, వేణు, రఘుమోహన్‌రెడ్డి, కేసాని అనంతరెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment