కత్తి వీరయ్య
కోదాడ రూరల్ ఎస్‌ఐపై ఎస్పీకి ఫిర్యాదు
కోదాడరూరల్ : మండల పరిధిలోని కూచిపూడిలో పలు కేసుల్లో రూరల్ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామానికి చెందిన శెట్టి సురేష్‌తోపాటు మరికొందరు గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అయ్యప్ప మాలధారులు నిర్మించుకున్న గోశాల కూల్చివేసిన వారిపై స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారిపై కేసు నమోదు చేయకుండా తమనే సంబఽంధిత భూ పత్రాలు తీసుకురావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటుగా గ్రామానికి చెందిన మహిళను వేధించిన కేసులో సదురు వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఇద్దరిపై కేసు పెట్టాల్సి ఉంటుందని తమను బెదిరించారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో శెట్టి చంద్రయ్య, శెట్టి రమేష్, పలువురు గ్రామస్తులు ఉన్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ అనిల్‌రెడ్డిని వివరణ కోరగా.. కూచిపూడి గ్రామంలో జరిగిన సంఘటనలో ఎవరిని ఇబ్బందులు పెట్టలేదన్నారు. సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా విధులు నిర్వహిస్తున్న తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
నాడు పశువుల కాపరి.. నేడు డాక్టరేట్
మునగాల : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు విజయరాఘవపురంకు చెందిన ఓ యువకుడు. నాడు పశువుల కాపరిగా ఉన్న ఆ యువకుడు నేడు డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. వివరాలు.. మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన కత్తి చంద్రయ్య–ముత్తమ్మ దంపతుల కుమారుడు కత్తి వీరయ్య బడికి వెళ్లే సమయంలో పదేళ్ల పాటు పశువుల కాపరిగా ఉంటూ తన అన్న ప్రోద్బలంతో మూడో తరగతిలో చేరాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూ మరోవైపు ఉద్యమాల్లో పాల్గొంటూ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ తర్వాత వివాహమైంది. కొన్నాళ్లు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తిరిగి తన చదువును ప్రారంభించిన వీరయ్య.. పీజీ పూర్తిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీ నుంచి ప్రొఫెసర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ‘అప్లికేషన్ ఆఫ్ జి.ఐ.ఎస్ అర్బన్ ల్యాండ్ యూజ్ చేంజెస్ ఇన్ సూర్యాపేట మున్సిపల్ ఏరియా’అనే అంశంపై ఇటీవల డాక్టరేట్ పట్టా అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment