పోటాపోటీ కార్యక్రమాలతో
రుణమాఫీపై తిరుమలగిరి, ఆలేరులో బీఆర్‌ఎస్ చేపట్టిన రైతు ధర్నాలు ఉద్రిక్తతకు దారితీశాయి. తిరుమలగిరిలో బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, ఆ తరువాత బీఆర్‌ఎస్ ధర్నా శిబిరం వద్దకు వెళ్లడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఇక ఆలేరుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్‌రావు.. రుణమాఫీపై సీఎం మాట తప్పారని యాదాద్రిలో
పాప ప్రక్షాళన పూజ చేయించగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవస్థానం ఈఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు.
బీఆర్‌ఎస్ నాయకులు యాదాద్రిని అపవిత్రం చేశారంటూ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఆలయాన్ని శుద్ధి చేశారు.
ఫ తిరుమలగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఘర్షణ
ఫ రాళ్లు, కోడిగుడ్లు విసురుకున్న ఇరువర్గాలు
ఫ పలువురికి స్వల్ప గాయాలు
ఫ యాదాద్రిలో హరీష్‌రావు పాప ప్రక్షాళన
ఫ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు
ఈఓ ఫిర్యాదు
ఫ ఆలయాన్ని శుద్ధి చేసిన బీర్ల అయిలయ్య
Comments
Please login to add a commentAdd a comment