కాలం తీరినా | - | Sakshi
Sakshi News home page

కాలం తీరినా

Published Sat, Aug 24 2024 12:58 PM | Last Updated on Sat, Aug 24 2024 12:58 PM

కాలం తీరినా

విద్యార్థులు సైంటిస్ట్‌లుగా ఎదగాలి
ప్రతి విద్యార్థి గొప్ప సైంటిస్ట్‌గా ఎదగాలని ఇస్రో శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ అన్నారు.

శనివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2024

- 8లో

జిల్లాలో 12వేల వాహనాలు

15 ఏళ్లు పూర్తయినవే..

రీ వ్యాలిడిటీ చేయించుకోని

వాహనదారులు

ఫిట్‌నెస్‌ చేయించుకోవాలంటున్న రవాణా శాఖ అధికారులు

సూర్యాపేట టౌన్‌ : పదిహేనేళ్లు దాటితే వాహనాలకు వ్యాలిడిటీ అయిపోతుంది. మళ్లీ వాటిని ఫిట్‌నెస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కాలపరిమితి తీరిన వాహనాలు జిల్లావ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ సదరు వాహనాల యాజమానులు రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిప్పుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాల పరిమితి పెంచుకునేందుకు ఫీజులు కట్టకపోవడంతో జిల్లా రవాణా శాఖ ఆదాయానికి భారీ గండి పడుతోంది.

15 ఏళ్లు దాటితే జరిమానా చెల్లించాల్సిందే..

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా జూలై 31 వరకు కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జీపులు, కంప్రెషర్‌ వాహనాలు, లారీలు, ఆటోలు తదితర వాహనాలు వ్యాలిడిటీ తీరినవి రవాణా శాఖ లెక్కల ప్రకారం 12 వేల వరకు ఉన్నాయి. కార్లకు సంబంధించి 15 ఏళ్లు దాటిన తర్వాత మరో ఐదేళ్లు వ్యాలిడిటీ పొడిగించుకోవడానికి గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.5వేలు, రిజిస్ట్రేషన్‌ రూ.5435 మొత్తం రూ.10 వేల పైనే అవుతుంది. ద్విచక్ర వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.వేయి, ఫీజు రూ.2435 మొత్తం రూ.3445 చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ రీ వ్యాలిడిటీ చేసుకోవడానికి జాప్యం చేస్తే నెలనెలా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అవకాశం కల్పించినా..

వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోకపోవడంతో అటు ప్రమాదకర ప్రయాణాలతోపాటు సదరు వాహనాలు వెదజల్లే కాలుష్యంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు గడువు పొడిగింపే లేదు. వాటిని తుక్కు కింద విక్రయిస్తారు. ఇక్కడ కాల పరిమితి పెంచుకునే అవకాశం కల్పించినా వాహనదారులు శ్రద్ధ చూపడం లేదు.

న్యూస్‌రీల్‌

జిల్లాలో 2024 జూలై 31 వరకు వ్యాలిడిటీ పూర్తయిన వాహనాలు

ద్విచక్ర వాహనాలు 6700

కార్లు 2340

మిగతా వాహనాలు 2960

మొత్తం వాహనాలు 12000

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement