‘ప్రజా పాలన’ సవరణలకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

‘ప్రజా పాలన’ సవరణలకు అవకాశం

Published Sat, Aug 24 2024 12:58 PM | Last Updated on Sat, Aug 24 2024 12:58 PM

‘ప్రజ

నాగారం : ప్రజా పాలన దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. ప్రజాపాలన దరఖాస్తులను కొందరు ఆపరరేటర్లు సరిగా ఆన్‌లైన్‌ చేయకపోవడం, మరికొందరు అవగాహన లేక ఆరు గ్యారంటీల్లో కొన్నింటికి టిక్‌ చేయలేదు. ఇలా ఎవరైతే కంప్యూటర్‌లో గ్యారంటీల కాలం ఎదుట టిక్‌ చేయలేదో వారికి మొన్నటివరకు శ్రీనాట్‌ అప్లయ్‌శ్రీఅనే సమాచారం వచ్చింది. దీంతో అర్హులు ఏడు నెలలుగా గృహజ్యోతి పథకానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. నాట్‌ అప్లయ్‌ అనే సమాచారం వచ్చిన గడులను సవరించే అవకాశం లేకపోవడంతో అర్హులు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి అప్లయ్‌ చేసుకోవడానికి కొత్త అప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో అర్హులైన వారు ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి వివరాలు సమర్పిస్తున్నారు.

పత్రాలు వెంట తీసుకెళ్లాలి..

ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం జనవరి నెలలో పేద, మధ్య తరగతి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దీనిలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రాయితీపై గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తోంది. కానీ కొంతమంది దరఖాస్తుల్లో తప్పులు దొర్లడంతో వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయి. దీంతో వారికి ప్రయోజనం చేకూరేలా ప్రజాపాలన కేంద్రాలను ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. గతంలో దరఖాస్తుదారులు ఎక్కడ దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి తమ వివరాలు అప్‌డేట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన పత్రం, రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, విద్యుత్‌ బిల్లులోని యూఎస్‌సీ నంబర్‌ను వెంట తీసుకెళ్లి వివరాలను అప్‌డేట్‌ చేయించుకోవాలి. వివరాలు అప్‌డేట్‌ అయితే గృహజ్యోతి పథకానికి అర్హత లభిస్తుంది. ఇదివరకు దరఖాస్తు చేసుకుని విద్యుత్‌ జీరో బిల్లు రాని వారైతే మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసిన రశీదు చూపించి సరిచేసుకోవచ్చు. అద్దె ఇంటిని ఖాళీ చేసి మరో ఇంట్లో ఉంటే మీటరు నంబర్‌ మార్చుకునే ఎడిట్‌ ఆప్షన్‌ ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు గృహజ్యోతి లబ్ధిదారులు 1,69,372 మంది ఉన్నారు. పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం లభించినట్లయితే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలి

అర్హులై ఉండి గృహజ్యోతి పథకం వర్తించని వారు ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి తమ వివరాలు అప్‌డేట్‌ చేయించుకోవాలి. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన పత్రం, రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, విద్యుత్‌ బిల్లులోని యూఎస్‌సీ నంబర్‌ను వెంట తీసుకెళ్లి వివరాలను నమోదు చేయించుకోవాలి.

– శ్రీనివాస్‌, విద్యుత్‌శాఖ డీఈఈ, సూర్యాపేట

ఫ కొత్త ఆప్షన్‌ ఇచ్చిన ప్రభుత్వం

ఫ గృహజ్యోతి అందని అర్హులకు ఊరట

ఫ దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
‘ప్రజా పాలన’ సవరణలకు అవకాశం1
1/1

‘ప్రజా పాలన’ సవరణలకు అవకాశం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement