మట్టపల్లి క్షేత్రంలో నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లి క్షేత్రంలో నిత్య కల్యాణం

Published Mon, Aug 26 2024 10:16 AM | Last Updated on Mon, Aug 26 2024 10:16 AM

-

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణాలతో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా పూర్తిగావించారు. ఆలయ ప్రవేశానంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

పంచనారసింహుడికి

ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట: పంచనారసింహ క్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు కొనసాగాయి. అర్చకులు ఉదయం సుప్రఽభాతం, ఆరాధన జరిపించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement