ఆయిల్‌పామ్ సాగుచేసి లాభాలు పొందండి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోని బ్రాహ్మణ సదన్ కల్యాణ మండపంలో ఉద్యానవన శాఖ, పతంజలి ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్‌సాగుపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు నీటి వసతి ఉంటే వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి తీగల నాగయ్య, సుబ్బారావు, పతంజలి డీజీఎం బి. యాదగిరి, అధికారులు మహేష్, కట్టస్వాతి, ప్రమిత, పతంజలి మేనేజర్ హరీష్, జూనియర్ మేనేజర్ శశికుమార్, వెంకట్, అశోక్, సిబ్బంది రంగు ముత్యం రాజు, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలి
మునగాల: రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. మంగళవారం మునగాల మండలం మాధవరం శివారులో పతంజలి కంపెనీ ఆధ్వర్యంలో పెంచుతున్న ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీకి ఇతర దేశాల నుంచి వచ్చే మొక్కల వివరాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుతో అధికలాభాలు పొందవచ్చన్నారు. రైతులకు నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలు అందించాలన్నారు. నర్సరీలో నాణ్యత లేని మొక్కలను గుర్తించి వెంటనే కాల్చివేయాలన్నారు. రైతులకు నాణ్యమైన , ఆరోగ్యకరమైన మొక్కలు సరఫరా చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. మొక్కల పెంపకంలో అలసత్వం వహించవద్దని కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక ఉద్యానవన అధికారి మహేష్, పతంజలి డీజీఎం బి.యాదగిరి, మేనేజర్ జె.హరీష్, నర్సరీ అధికారి స్రవంతి పాల్గొన్నారు.
ప్రజలను భాగస్వాములు చేయాలి
భానుపురి(సూర్యాపేట) : ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 19 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మరుగుదొడ్ల వారోత్సవాల కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. వచ్చేనెల 5వ తేదీ వరకు వ్యక్తిగత మరుగుదొడ్లకు రంగులు వేయించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీపీఓ నారాయణరెడ్డి, డీఈఓ అశోక్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment