ప్రతీ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
పాలకవీడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనతి కాలంలో ప్రతీ రంగంలో విఫలం చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి మాతృమూర్తి కామేశ్వరమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. దీంతో అంజిరెడ్డి కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కామేశ్వరమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వందశాతం అభివృద్ధి పరిచింది తమ అనాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా పురోగమించారని, కాంగ్రెస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా సాయం అందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు, చివరి గెలుపని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు మనోవేదన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ హుజూర్‌నగర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి, జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకట్‌రెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, అరిబండి బాబు, దొండపాటి అప్పిరెడ్డి, జయబాబు, పచ్చిపాల ఉపేందర్, బెల్లంకొండ అమర్, చెన్నబోయిన సైదులు, రాపోలు నవీన్, పసుపులేటి సైదులు, లక్ష్మారెడ్డి, జాన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment