అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. సమాచార పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కళాయాత్ర వాహనాలను బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం కళాయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రోజూ మూడు గ్రామాల్లో ఆటపాటలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని సూచించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, డీఐఈ మల్లేష్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
పదవ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలోని ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో డీఈఓ అశోక్ తో కలిసి జిల్లాలోని ఎంఈఓలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్ లతో పదవ తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నాటికి ప్రతి విద్యార్థి 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి పద్మజ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి లత, మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు సెక్రటరీ కళారాణి, క్వాలిటీ కోఆర్డినేటర్స్ శ్రావణ్ కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment