25న మట్టపల్లిలో కోటి దీపోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈనెల 25న కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌లు తెలిపారు. ఈమేరకు బుధవారం వారు మాట్లాడారు. 25న సాయంత్రం 6.30గంటలకు ఆలయంలోని ముఖమండపంలో ద్వీపప్రజ్వలన, పవిత్ర కృష్ణానదికి కార్తీక దీపాలతో హారతి, ఆలయ రాజగో పురం ముందు కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈఏడాది జనవరి నుంచి జూన్‌మాసం వరకు భక్తులు సమర్పించిన తలనీలాలకు ఈనెల 22న ఆలయంలో వేలం ఉంటుందని, ఆసక్తి గలవారు రూ.50వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడంలేదు
సూర్యాపేటటౌన్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు సామ అంజిరెడ్డి, జేఏసీ కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, ఉద్యమకారులు మిర్యాల వెంకటేశ్వర్లు, కోడి సైదులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను బుధవారం సూర్యాపేట రైతుబజార్‌లోగల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 24న సూర్యాపేటలో ప్రారంభమయ్యే ఉద్యమకారుల పాదయాత్ర ఉరూరా సాగుతూ భద్రాచలం చేరుకుంటుందన్నారు. ఉద్యమకారులను గుర్తించే సద్బుద్ధిని ప్రభుత్వానికి ప్రసాదించాలని ఆ శ్రీరామచంద్రుడికి వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు బొమ్మి డి లక్ష్మీనారాయణ, కోతి మాధవి, మధుసూదన్‌రెడ్డి, కిషన్, కె.గోపి, విద్యాసాగర్, యూసుఫ్, చిత్రం భద్రమ్మ, గంగయ్య, మైసయ్య, కట్ట రాజు, మోర శైలేందర్ పాల్గొన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో స్వామి,అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తికట్టించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఈకార్యక్రమంలో చెన్నూరు విజయ్‌కుమార్ , మట్టపల్లిరావు, నవీన్‌కుమార్, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణి భూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
నృసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీపత్రాలతో అర్చన చేశారు. ప్రధానాలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు. స్వామి, అమ్మవారి జోడు సేవను మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment