ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు వేగం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలలో బుధవారం ఎన్‌డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, డబుల్ బెడ్‌రూం ఇళ్లను, రామన్నగూడెంలో సమగ్ర ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంటాలైన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ముమ్మరం చేయాలని కోరారు. గురువారం నుంచి సర్వే వివరాలు అన్‌లైన్ చేసే కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఇంటింటి సర్వేపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీఎస్‌ఓ సైదిరెడ్డి, గిర్దావర్‌లు పాటి వెంకట్‌రెడ్డి, ప్రసన్న, సూపర్‌వైజర్ రామరాజు జలేంధర్‌రావు, ఏఈఓ నేరెళ్ల సత్యం, పంచాయతీ కార్యదర్శి మహాలక్ష్మి, ఎన్యుమరేటర్ ఎ. పుష్ప, సీఓ ఖమ్మంపాటి సైదులు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగ, ఎన్‌డీసీఎంఎస్ కేంద్రం ఇన్‌చార్జి ఆవుల విక్రం పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment