బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు
పాలకవీడు: బహింగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. బుధవారం పాలకవీడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, నేర విభాగానికి సంబంధించిన పలు రికార్డులు, ఫిర్యాదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిత్యం వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. గుట్కా, గంజాయి రవాణాపై నిఘా ఉంచాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలన్నారు. కోర్టు కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని సీఐ, ఎస్‌ఐలను ఆదేశింంచారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆయన వెంట సీఐ చరమందరాజు, ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య, సిబ్బంది ఉన్నారు.
ఫ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment