నిరుద్యోగ యువతకు అండగా జిల్లా గ్రంథాలయం
భానుపురి (సూర్యాపేట) :సూర్యాపేట జిల్లా గ్రంథాలయం నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించడానికి అండగా నిలుస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా గ్రంథాలయంలో 57 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్నారని, పిల్లలు ఉద్యోగం సాధించినప్పుడు తల్లిదండ్రులు పొందే ఆనందం మాటల్లో చెప్పలేమని ఆయన అన్నారు. జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలతో పాటు వారికి సౌకర్యాలు కల్పిస్తున్న గ్రంథాలయ ఇన్చార్జ్ శ్యామ్ సుందర్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. గ్రంథాలయంలో చదివి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 36 మందిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బాలమ్మ, ఇన్చార్జ్ శ్యామ్ సుందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇరుగు కోటేశ్వరి, పొనుగోటి నిర్మల, ఎన్ సి రోజా, రిటైర్డ్ లైబ్రేరియన్ వెంకట్, నాగేశ్వరరావు, బాలాజీ నాయక్, రంగారావు, శ్రవణ్, విజయ భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment