చివ్వెంల(సూర్యాపేట): బాలలు, సీనియర్ సిటిజన్స్ హక్కులపై ప్యానల్ లాయర్లు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార కార్యాలయంలో కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట ప్యానల్ లాయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడడం, చెడు వ్యసనాలకు అలవాటు పడడం, ఘర్షణలకు పాల్ప డడం వంటి వాటికి కోర్టులు వేసే శిక్షల గురించి తెలియజేయాలన్నారు. ఆర్థిక స్థోమత లేని వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారికి లాయర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment