మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అనురాధ
తుంగతుర్తి: మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన తిరుమలప్రగడ అనురాధ కిషన్‌రావు రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లాలో అత్యధిక సభ్యత్వ నమోదును గుర్తించి ఏఐటీయూసీ నాయకులు తనకు రెండో సారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గుర్తింపు నివ్వడం హర్షణీయమన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల కాంగ్రెస్‌పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దేవారం అనితప్రభాకర్‌రెడ్డి, కోదాడ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉదయ్‌శ్రీ, మండల అధ్యక్షుడు గోవర్ధన్, ప్రవీణ్‌రెడ్డి, సోమయ్య, వెంకన్న, రాజు, మహేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.
నేరప్రవృత్తిని వీడాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీలు నేరప్రవృత్తిని వీడి మంచి పౌరులుగా ఎదగాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఖైదీల మెనూ, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో ఉన్న పేదవారికి జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో లాయర్‌ను నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, వెంకరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, జైలు సూపరింటెండెంట్ బి.సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
తపాలా బీమా.. కుటుంబానికి ధీమా
గరిడేపల్లి: తపాలా బీమా చేస్తే కుటుంబాలు ధీమా గా ఉండవచ్చని తపాలా జీవిత బీమా జిల్లా అధికారి సైదులు పేర్కొన్నారు. తపాలా జీవిత బీమా పాలసీలపై బుధవారం గరిడేపల్లి మండలంలో వెలిదండ గ్రామంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రచార మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీమా పాలసీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ అంజయ్య, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి
చివ్వెంల : తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గొల్ల కుర్మల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అబోతు రాజుయాదవ్ కోరారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామశివారులో గల శ్రీలింగమంతుల స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 300 సంవత్సరాల చరిత్ర గల జాతరకు ముందు తాత్కాలికంగా పనుల చేపట్టడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి శాశ్వత నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. పూజారులను యాదవ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఆయన వెంట లింగయ్య, కిష్టయ్య, సందయ్య, నాగయ్య, జంపాల శ్రీను ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment