జాతరకు సమన్వయంతో పనిచేయాలి
మేళ్లచెరువు: వచ్చేనెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా మహాశివరాత్రి జాతరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్ ఆదేశించారు. మేళ్ల చెరువు జాతర నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జాతరలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జాతరకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు ఇబ్బందులు పడకుండా దైవదర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయ పరిసరాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా చూడాలన్నారు. క్యూలైన్, ప్రసాదకౌంటర్‌లు, ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు జరిగే ప్రదేశాల్లో నీడ, తాగునీరు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముందు కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు స్వామివారి ఆశీస్సులు అందించారు. అంతకుముందు మేళ్లచెర్వు మండలంలోని కందిబండ–రామాపురం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఆయన వెంట హుజూర్‌నగర్ ఆర్‌డీఓ శ్రీనివాసులు, డీపీఓ నారాయణరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, దేవాదాయ అస్టింట్ కమిషనర్ మహేందర్‌కుమార్, సీఐ రజితారెడ్డి , తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ అస్గర్‌అలీ, ఎస్‌ఐ పరమేష్, ఎంపీఓ ఫరీద్, ఆలయ మేనేజర్ కొండారెడ్డి, మైహోం, కీర్తి, రెయిన్ సిమెంట్ పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు.
నిర్దేశించిన గడువులోగా భూమిని గుర్తిస్తాం
భానుపురి (సూర్యాపేట) : మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు జిల్లాలో నిర్దేశిత గడువులోగా 150 ఎకరాలను గుర్తించి నివేదికలు అందిస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజాభవన్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 4 ఎకరాలు గుర్తించామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఫ్రాంక్లిన్, డీటీడీఓ శంకర్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వరకు మేళ్లచెరువులో శివరాత్రి జాతర
ఫ అధికారులతో సమీక్షలో కలెక్టర్
తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment