మంత్రి పీఏనంటూ..
మంత్రి పీఏనంటూ మహిళలకు ఫోన్ చేసి వేధిస్తున్న వ్యక్తిని కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
- 8లో
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు, టీజీడబ్ల్యూఆర్‌ఐఈఎస్ రుక్మాపూర్, సైనిక్ పాఠశాల, మల్కాజ్‌గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూలో 6వ తరగతి ప్రవేశాలు, టీజీడబ్ల్యూఆర్‌ఐఈఎస్ ఖమ్మం, పరిగి ఎస్‌ఓఈలో 8వ తరగతి, టీజీడబ్ల్యూఆర్‌ఐఈఎస్ గౌలిదొడ్డి, అలుగునూర్ సీఓఈలో 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 23న నిర్వహించే పరీక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఈ దరఖాస్తులను ఫిబ్రవరి 1వ తేదీ వరకు tgcet.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment