సమయ పాలన పాటించాలి
భానుపురి (సూర్యాపేట) : వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు వివరాలు పరిశీలించారు. కొంతమంది సిబ్బంది సంతకాలు హాజరు రిజిస్టర్‌లో లేకపోవటంతో ఆరా తీశారు. వారంతా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లినట్లు సిబ్బంది చెప్పడంతో ఇకపై క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లే సిబ్బంది మూమెంట్ రిజిస్టర్‌నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి పరిపాలన అధికారి డాక్టర్ శ్రీశైలం, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment