దుప్పట్లు పంపిణీ చేస్తున్న సభ్యులు
శ్రీరంగం ఆలయ వివాదం
● ఆంధ్రా భక్తులపై కేసు నమోదు
కొరుక్కుపేట: తిరుచ్చి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి దర్శనం కోసం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చెన్నారావు, శాంతా రావు సహా 30మందికి పైగా అయ్యప్ప భక్తులు వచ్చారు. మూలస్థానం సమీపంలోని గాయత్రి మండలంలో ఉంచిన హుండీని చేతులతో తట్టారు . దీనిని ఆలయ వాచ్‌మన్ విఘ్నేష్ ఖండించారు. దీంతో మూలస్థానం ఎదుట ఆంధ్రా భక్తులకు, ఆలయ కాపలాదారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందులో ఆంధ్రాకు చెందిన చెన్నారావు, శాంతారావు, రాము అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అలాగే ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి శ్రీరంగం పోలీసులు ఆలయ గార్డులు భరత్, సెల్వ, విఘ్నేష్‌ను అందుపులోకి తీసుకున్నారు. అలాగే ఆంధ్ర భక్తులపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
వరద బాధితులకు
సహాయకాల పంపిణీ
కొరుక్కుపేట: యూత్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (యేవా) ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయకాలను పంపిణీ చేశారు. చైన్నె కన్యకాపురం సత్యవాణి ముత్తునగర్‌లో జరిగిన కార్యక్రమంలో యేవా సంస్థ వ్యవస్థాపకుడు లింగాబత్తిన మాల్యాద్రి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కొండల రావు, సభ్యులు శ్రీనివాసులు పారిశుద్ధ్య కార్మికులు సహా 200 మంది పేదలకు దుప్పట్లు అందజేశారు. యేవా కార్యదర్శి శ్రీహరి, కేపీ రావు, చెన్నయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
లారీ ఢీకొని చిన్నారి మృతి
తిరువొత్తియూరు: తండ్రితో కలిసి బైక్‌పై వెళుతుండగా అదుపు తప్పి కిందపడడం.. అదే సమయంలో లారీ దూసుకురావడంతో చిన్నారి మృతి చెందింది. కడలూరు జిల్లా చిదంబరం కుక్కలింగ వీధికి చెందిన జంబులింగం కుమార్తె జనుష్కా మనలూరులోని ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అర్ధ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కావడంతో జంబులింగం కుమార్తెను పాఠశాలలో వదలిపెట్టడం కోసం మోటారు సైకిల్‌పై తీసుకొస్తున్నాడు. రోడ్డుపై వంతెన పని జరుగుతుండడంతో గుంతలుగా ఉన్న రోడ్డులో అదుపు తప్పి మోటారు సైకిల్ నుంచి జంబులింగం, అతని కుమార్తె జనుష్క ఇద్దరు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ చిన్నారిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
డాక్టర్‌పై దాడి.. రోగి అరెస్టు
తిరువొత్తియూరు: సేలంలో ఆరు నెలలుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా నయం కాకపోవడంతో ఆగ్రహించి డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన రోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం రామకృష్ణ రోడ్డుకు చెందిన డాక్టరు భాస్కర్ (50) బస్టాండ్ వద్ద క్లినిక్ నడుపుతున్నాడు. ఇతను మానసిక రుగ్మతకు చికిత్స చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం మేట్టూరు పుదుసంపల్లికి చెందిన గౌతమ్ (32)కు చికిత్స చేస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా అతను వెంత తెచ్చుకున్న కత్తితో డాక్టర్ భాస్కర్‌పై దాడి చేశాడు. ఆసుపత్రి ఉద్యోగులు గౌతమ్‌ను పట్టుకున్నారు. గాయపడిన డాక్టర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పల్లిపట్టి పోలీసులు కత్తితో దాడి చేసిన రోగిని అరెస్టు చేశారు. అతని వద్ద విచారణ చేశారు. ఆరు నెలలుగా తాను చికిత్స తీసుకుంటున్నా నయం కాకపోవడంతో డాక్టర్‌పై దాడి చేసినట్లు అతను తెలిపాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
దివ్యాంగుల నిరసన
పళ్లిపట్టు: డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ప్రత్యేక ప్రతిభావంతలు పళ్లిపట్టు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిరసన చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ గీత అధ్యక్షతన 50కు పైగా ప్రత్యేక ప్రతిభావంతులు నిరసనలో పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంభురాజన్ ప్రసంగించారు. ప్రత్యేక ప్రతిభావంతుల కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీలో జాప్యం చేయరాదని, చిన్నచూపు ప్రదర్శిస్తున్న టీఎస్‌ఓపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 63,021 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 19,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.15 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 8 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment