కెరటాలు మింగేశాయ్‌..! | Sakshi
Sakshi News home page

కెరటాలు మింగేశాయ్‌..!

Published Tue, May 7 2024 10:20 AM

కెరటా

సాక్షి, చైన్నె: సముద్ర తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించినా, నిర్లక్ష్యంగా సముద్ర స్నానానికి వెళ్లిన జూనియర్‌ డాక్టర్లలో ఐదుగురు విగత జీవులయ్యారు. మరో ఐదుగురిని స్థానికులు రక్షించారు. వివరాలు.. చైన్నె– కడలూరు– తూత్తుకుడి– కన్యాకుమారి వరకు సముద్రంలో అలల తాకిడి మూడు లేదా నాలుగు రోజుల అధికంగా ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అలల గత రెండు రోజులుగా భారీస్థాయిలో ఎగసి పడుతూ వస్తున్నాయి. మంగళవారం కూడా కెరటాల జడి అధికంగా ఉంటుందని ప్రకటించారు. ఈ పరిస్థితులలో వివాహ వేడుకకు వచ్చిన జూనియర్‌ డాక్టర్లు పలువురు ఈ హెచ్చరికను విస్మరించి జన సంచారం తక్కువగా ఉండే బీచ్‌లో స్నానానికి వెళ్లి విగత జీవులయ్యారు. కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ సమీపంలోని గణపతి పురానికి చెందిన ముత్తుకుమార్‌ తిరుచ్చిలోని ఎస్‌ఆర్‌ఎం వైద్య కళాశాల, ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా ఉన్నారు. నాగర్‌ కోయిల్‌ సమీపంలోని శెట్టికులంలోని మిత్రుడి ఇంటి శుభ కార్యానికి వచ్చాడు. తనతో పాటు చదువుకుంటూ శిక్షణలో ఉన్న మిత్రులైన జూనియర్‌ డాక్టర్లు మరో 11 మందిని వెంట బెట్టుకొచ్చాడు. ఈ వేడుకను ముగించుకున్న మిత్రులు కన్యాకుమారి అందాలను ఆదివారం నుంచి తిలకిస్తూ వచ్చారు. అన్ని చోట్లా చక్కర్లు కొట్టినానంతరం నాగర్‌ కోయిల్‌ సమీపంలో పెద్దగా జన సంచారం లేకుండా ఉండే లీమోర్‌ బీచ్‌కు వెళ్లారు.

అలల్లో చిక్కుకుని..

సోమవారం ఉదయాన్నే పది మంది మిత్రులు స్నానానికి వెళ్లారు. ఇందులో ఐదుగురు మహిళా డాక్టర్లు ఉన్నారు. అప్పటికే అలలు తీవ్రస్థాయిలో ఎగసి పడుతున్నా, లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా రాక్షస అల వీరిని చుట్టుముట్టింది. దీనిని గుర్తించిన సమీపంలోని జాలర్లు ఐదుగురిని రక్షించారు. మిగిలిన వారిని కాపాడ లేక పోయారు. ఈ ఘటనలో జూనియర్‌ డాక్టర్లు ప్రవీణ్‌ (23), గాయత్రి (25), చారు కవి (23), దర్శిత్‌ (23), వెంకటేశ్‌ (24)మరణించారు. చారుకవి(తంజావూరు), గాయత్రి (నైవేలి), దర్శిత్‌ (కన్యాకుమారి), ప్రవీణ్‌ (దిండుగల్‌), వెంకటేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌)కు చెందిన వారి గా గుర్తించారు. వీరంతా ఒకే కళాశాలలో చదువుకుంటున్న మిత్రులు. వీరి మరణ సమాచారంతో ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. వీరి మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం ఆచారి పల్లం ఆస్పత్రి మా ర్చిరికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కరూర్‌కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి ప్రియాంక, మదురైకు చెందిన శరణ్య ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సముద్ర తీరంలో కెరటాలు ఎగసి పడుతాయన్న హె చ్చరికల నేపథ్యంలో ఈ బీచ్‌లోకి వీరిని అనుమతించడం చర్చకు దారి తీసింది. బీచ్‌లో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే జూనియర్‌ డాక్టర్లు సముద్రలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు జాలర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సీఎ స్టాలిన్‌ ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మృతి చెందిన జూనియర్‌ డాక్టర్లు (ఫైల్‌)

ఐదుగురు వైద్య విద్యార్థుల దుర్మరణం

మరో ఐదుగురి రక్షింపు

లీమోర్‌ బీచ్‌లో ఘటన

కెరటాలు మింగేశాయ్‌..!
1/1

కెరటాలు మింగేశాయ్‌..!

Advertisement

తప్పక చదవండి

Advertisement