పెళ్లి రోజు పరారైన వరుడు
ఆగిన పెళ్లి
పోలీసులకు ఫిర్యాదు
20 రోజుల తర్వాత గుడిలో పెళ్లి చేసుకుని ఎస్పీ ఎదుట హాజరు
తిరువళ్లూరు: పెళ్లి రోజు పరారైన వరుడు దాదాపు 20 రోజుల తర్వాత పెళ్లి చేసుకుని పోలీసుల ముందు బుధవారం ప్రత్యక్షమైన ఘటన చర్చినీయాంశంగా మారింది. రాణిపేట జిల్లా, నెమిలి ప్రాంతానికి చెందిన శ్రీధరన్ బెంగళూరులోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇదే కంపెనీలో కుంభకోణం ప్రాంతానికి చెందిన దళిత కులానికి చెందిన అనుసూయని నాలుగేళ్లుగా ప్రేమించాడు.
ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో సెప్టంబర్ 15న తిరుత్తణి–అరక్కోణం రోడ్డు లోని ప్రయివేటు కల్యాణ మండపంలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇందులో భాగంగానే రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. అయితే రిపెప్షన్‌కు హాజరైన శ్రీధరన్ పెళ్లికి రెండు గంటల ముందు మండపం నుంచి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతి అనుసూయ బంధువులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు తిరుత్తణి పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.
పరారీలో ఉన్న శ్రీధరన్ బుధవారం రాత్రి 8 గంటలకు యువతిని ఎస్పీ కార్యాలయ సమీపంలోని అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ ఎదుట హాజరై తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని వివరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చినీయాంశంగా మా రింది. అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా మహిళ పోలీసు స్టేషన్‌లో హాజరైన క్రమంలో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఇంటికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment