పక్కా కమర్షియల్‌గా! | - | Sakshi
Sakshi News home page

పక్కా కమర్షియల్‌గా!

Published Mon, Nov 4 2024 12:38 AM | Last Updated on Mon, Nov 4 2024 12:38 AM

పక్కా కమర్షియల్‌గా!

పక్కా కమర్షియల్‌గా!

పంచ్‌ డైలాగులతో..

రజనీకాంత్‌ హెయిర్‌ స్టైల్‌ను సెట్‌ చేస్తున్న లోకేష్‌ కనకరాజ్‌

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. స్టైల్‌ కింగ్‌ ఈయన. అదే విధంగా రజనీకాంత్‌ చిత్రాల్లో పంచ్‌ డైలాగ్స్‌కు థియేటర్స్‌ దద్ధరిల్లుతాయి. అభిమానుల చప్పట్లు మారుమోగుతాయి. అయితే అలాంటి పంచ్‌ డైలాగులు ఇటీవల రజినీకాంత్‌ చిత్రాల్లో తగ్గాయనే చెప్పాలి. ఈయన నటించిన జైలర్‌, వేట్టయన్‌ చిత్రాలు సక్సెస్‌ అయినా ఆ చిత్రాలు పంచ్‌ డైలాగులు పెద్దగా లేవు. వేట్టయన్‌ చిత్రం అయితే పూర్తిగా దర్శకుడు డీజే జ్ఞానవేల్‌ శైలిలోనే సాగింది. కాగా ప్రస్తుతం రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం కూలీ. లోకేష్‌ కనకరాజు ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో నటి శృతిహాసన్‌ రజనీకాంత్‌ కు కూతురిగా నటిస్తున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్‌లో రూ.1000 కోట్లు వసూలు సాధించిన చిత్రం రాలేదు. దీంతో దర్శకుడు లోకేష్‌ కనకరాజు కూలీ చిత్రాన్ని రూ.1000 కోట్ల క్లబ్‌ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈ చిత్రంలో రజనీకాంత్‌ అభిమానులు తప్పట్లు కొట్టేలా పంచ్‌ డైలాగులు, అదే సమయంలో కమర్షియల్‌ అంశాలను జోడిస్తున్నట్లు తెలిసింది. కూలీ చిత్రం రూ.1000 కోట్లు వచ్చే విధంగా చిత్రానికి తన బాణీని మిస్‌ కాకుండానే రజనీకాంత్‌ స్టైల్‌ ను ఫాలో అవుతూ పూర్తి కమర్షియల్‌ కథా చిత్రంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా రజనీకాంత్‌ అభిమానులకు ఆనందం కలిగించే విషయమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement