వేలూరు కొత్త బస్టాండ్‌లో రద్దీ
వేలూరు: దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించింది. దీంతో చైన్నె, బెంగుళూరు, విల్లుపురం, సేలం వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు గత బుధవారం సొంత గ్రామాలకు వచ్చారు. సెలవు రోజులు పూర్తి కావడంతో నగరాలకు వెళ్లేందుకు వేలూరు కొత్త బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు బస్సుల్లో రద్దీ కారణంగా అవస్థలు పడ్డారు. ప్రయాణికులు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వేలూరు కొత్త బస్టాండ్ చేరుకొని చైన్నె, బెంగుళూరు, సేలం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించడంతో బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. అలాగే రాజస్థాన్, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు కాట్పాడి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. అదే విదంగా ఆదివారం సెలవు రోజు కావడంతో వేలూరు కోట మైదానంలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో చేరుకొని కాలక్షేపం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment