క్లుప్తంగా
అనుమానాస్పద స్థితిలో
రౌడీ మృతి
అన్నానగర్: చైన్నె ఓట్టేరి కేఎం గార్డెన్ 6వ వీధికి చెందిన దీపక్ (30) ఇతడిపై పలు కేసులు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో గంజాయి కేసులో పులియాంతోపు పోలీసులు అరెస్టు చేయగా.. పుళల్ జైలులో ఉండి బెయిల్‌పై ఇటీవల విడుదలయ్యాడు. ఈ స్థితిలో దీపక్ తన 2వ భార్యతో ఉంటున్నాడు. శనివారం ఉదయం పుళల్ తిరుపూర్ కుమరన్ స్ట్రీట్‌లోని తన మొదటి భార్య శివశంకరి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం కుటుంబసభ్యులతో మాట్లాడుతుండగా దీపక్ కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో షాక్ కు గురైన మొదటి భార్య ఇరుగుపొరుగు వారి సాయంతో కొళత్తూరు పెరియార్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అయితే మార్గమధ్యంలోనే దీపక్ మృతి చెందాడు. దీనిపై పుళల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీపక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు దీపక్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మృతి పోలీసులకు పలు అనుమానాలకు తావిస్తోంది. దీపక్ గుండెపోటుతో చనిపోయాడా?లేక మరేదైనా కారణమా? అని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
ఆకట్టుకున్న ‘సారె’ వేడుక
సేలం: ఈరోడ్ మున్సిపల్ కాలనీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కన్నదాసన్, చిత్ర దంపతులు. వీరి కుమార్తె ప్రజాశ్రీకి ఈమెకు పుష్పావతి వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ వేడుక కోసం మేనమామ సారెను చిత్ర సోదరులు రమేష్, శక్తివేల్ నిర్ణయించారు. దీంతో తిరుచ్చి నుంచి రెండు గుర్రపు బండ్లను తీసుకు వచ్చి, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పువ్వులు, పండ్లు, మిఠాయిలు అంటూ 100 రకాల సారెతో, కేరళ వాయిద్య కళాకారుల మేలతాళాలతో ఊరేగింపుగా చిత్ర ఇంటికి వచ్చారు. ఈ ఊరేగింపు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నుంచి ప్రారంభమైన నసియనూర్‌కు వెళ్లే రోడ్డు మార్గంగా కల్యాణ మండపం వరకు సినీ బాణీలో ప్రజాశ్రీని ఊరేగింపుగా తీసుకువెళ్లి వేడుక నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment