పోరాడే జీవించాలి
తమిళసినిమా: నటి సమంతను ఏదైనా ఎదుర్కొని పోరాడే ఐరన్ లేడీగా భావించవచ్చు. అలా జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలను ఎదురొడ్డి నిలిచారీమె. అందులో ఒకటి జీవన్మరణ సమస్య అనే చెప్పాలి. అదే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడం. ఇక రెండోది జీవిత భాగస్వామి నుంచి దూరం కావడం. ఈ రెండు సమస్యలు ఎదురొడ్డి జీవితాన్ని సాగిస్తున్న సమంత మళ్లీ నటించటానికి సిద్ధమవుతున్నారు. అలా ఈమె నటించిన భారీ వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జీవితం అనేది ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండదన్నారు. కొన్ని రోజులు అందంగా సాగిన మరికొన్ని రోజులు ఊహించిన విధంగా జరగదన్నారు. కాబట్టి రోజూ మనం పోరాడే జీవించాలన్నారు. తనకు అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు అనేక అసంబద్ధ వార్తలను అధిగమించాల్సి వచ్చిందన్నారు. ఏదేమైనా నిజాన్ని మించి ఎలాంటి అసత్యం ఎక్కువ రోజులు కొనసాగదన్నారు. అందరి జీవితంలోనూ పోరాటం అనేది కచ్చితంగా ఉంటుందన్నారు. దాన్ని అధిగమించడానికి కఠినంగా శ్రమించాలన్నారు. తనకు అలాంటి కొన్ని పోరాటాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు అన్ని సరైనవే అని చెప్పలేమన్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయాలు తప్పయితే వాటినే తలచుకుంటూ కూర్చోకూడదన్నారు. అలా తాను మాత్రం చేసిన తప్పులను తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడుతూ కూర్చోగలనూ అని అన్నారు. వృత్తిపరంగా ఆయినా వ్యక్తిగతంగా అయినా తాను 100 శాతం అంకితభావంతో పని చేస్తున్నానన్నారు. ఈ విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటానన్నారు. అయినప్పటికీ కొన్ని సమయాల్లో సక్రమంగా జరిగిన మరికొన్ని సమయాల్లో వ్యతిరేక ఫలితాలనే ఇస్తుందన్నారు. మన చుట్టూ ఉన్న సన్నిహితులు, మనం బాగుండాలని భావించే సహృదాయాలను చూస్తున్నప్పుడు ఇంకా పరుగులు తీయాలి ఇంకా శ్రమించాలి అని అనిపిస్తుందన్నారు. తాను ఇప్పుడు అదే చేస్తున్నానని నటి సమంత పేర్కొన్నారు. ఎన్ని పోరాటాల మధ్య మనల్ని అభిమానించే, ప్రేమించే వారు ఉండటం వల్లే మనం జీవితంలో లక్ష్యం దిశగా పరుగులు తీయగలమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment