మళ్లీ దర్శకత్వ బాటలో సెల్వరాఘవన్
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు సెల్వ రాఘవన్. కాదల్ కొండేన్, సెవెన్ 7జి రెయిన్ బో కాలనీ, పుదుపేటై, ఆయిరత్తిల్ ఒరువన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన చివరిగా ధనుష్ హీరోగా నానే వరువేన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022లో విడుదలై నిరాశపరిచింది. ఆ తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వానికి దూరమై నటనపై దృష్టి సారించారు. అలా పలు చిత్రాల్లో బైబిల్ చపాతి పాత్రను పోషించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటిది తాజాగా మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జి ప్రకాష్ కుమార్ తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌కు తాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని, సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడు అనే కేటగిరీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడుగా తనకు ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రంతోనే గుర్తింపు తెచ్చి పెట్టిన దర్శకుడు సెల్వరాఘవన్ అని ఆయన అందులో పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు రెండు చిత్రాలకు సంగీతాన్ని అందించానని, తాజాగా మూడో చిత్రానికి సంకేతాన్ని అందిస్తున్నారని, ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను విపరీతంగా ఆదరిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం గురించి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడి కాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment