3వ తరగతి చిన్నారికి హెచ్‌ఎం లైంగిక వేధింపులు
పళ్లిపట్టు: మూడో తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగిక వైధింపులకు గురిచేశాడనే ఆరోపణతో సోమవారం విద్యార్థులు పాఠశాల బహిష్కరించి ఆందోళనకు దిగారు. పళ్లిపట్టు పట్టణ పరిధిలోని ఆంజనేయనగర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 మంది బాల, బాలికలు చదువుకుంటున్నారు. ఆ పాఠశాల హెచ్‌ఎంగా చెంగల్వరాయన్(59) విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న ఇరుళ కుటుంబానికి చెందిన చిన్నారిని హెచ్‌ఎం పాఠశాల మరుగుదొడ్డిలో లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే చిన్నారితో పాటు తల్లిదండ్రుల వద్ద పోలీ సులు చేపట్టిన విచారణలో హెచ్‌ఎం లైంగిక వేధింపులకు పాల్పడలేదని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. పాఠశాల హెచ్‌ఎం మరుగుదొడ్డికి రమ్మని చెప్పి తనను లైంగికంగా వేధించినట్లు చిన్నారి చెప్పడం కలకలం రేపింది. ఈ ఘటనతో చిన్నారులను వారి తల్లిదండ్రులు బడికి పంపకుండా హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. విద్యార్ధులు తరగతుల బహిష్కరణతో విద్యాశాఖ మండల అధికారి కుమరగురుబరన్, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద విచారణ చేపట్టారు. లైంగిక దాడికి పాల్పడ్డ హెచ్‌ఎంను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని అంతవరకు తమ పిల్లలను బడికి పంపమని స్పష్టం చేశారు. కాగా ప్రారంభంలో హెచ్‌ఎం విద్యార్థిపై లైంగిక దాడి చేయలేదని, చిన్నారి తల్లిదండ్రులు పేర్కొని తర్వాత.. చిన్నారి వీడియోలో భిన్నంగా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
పాఠశాలను బహిష్కరించిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment