50 శాతం ఇవ్వాల్సిందే!
డెల్టాలో.. కుండపోత
రాష్ట్రాలకు పన్నుల విభజనలో కేంద్రం సమతుల్య విధానం అనుసరించే విధంగా 50 శాతం వాటాను అందజేయాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర నిధుల పంపిణీ తమిళనాడు అభివృద్ధికి అడ్డుగా మారి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు తరపున అందజేసిన నివేదికపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు.
సాక్షి, చైన్నె : కేంద్ర ప్రభుత్వంపై సీఎం స్టాలిన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు.. 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ తమిళనాడు పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఈకమిటీకి చైన్నెలోని ఓ హోటల్‌లో ప్రభుత్వ తరపున విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కమిటీలోని వారిని సీఎం స్టాలిన్ ఆహ్వానిస్తూ సత్కరించారు. సోమవారం ఉదయం అదే హోటల్‌లో ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులు అజయ్ నారాయణ్, అనీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, సీనియర్ మంత్రి దురై మురుగన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, మంత్రులు కేఎన్ నెహ్రూ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ఏవీ వేలు, మూర్తి, టీఆర్‌బీ రాజ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, ఫైనాన్స్ కమిటీ సెక్రటరీ రిత్విక్ పాండేతో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇందులో సీఎం ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ, రాష్ట్రాల అవసరాలు, అంచనాలను సంతృప్తి పరిచే విధంగా, భారత దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చే రీతిలో ఆర్థిక కమిషన్ సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భారత రాజ్యాంగ అధికారాలు బాధ్యతల పంపిణీ ఇప్పటికే జరిగినట్టు గుర్తు చేస్తూ, ఆ మార్గదర్శకాల ప్రకారం తాము అనుసరించే సమాఖ్య తత్వశాస్త్రం గురించి వివరించారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, వ్యవసాయం వంటి రంగాల పురోగతితో పాటు ముఖ్యమైన ప్రాజెక్టుల రూపకల్పన , అమలులో రాష్ట్ర ప్రభుత్వాలే అధికంగా బాధ్యతలు వహిస్తున్నాయని తెలిపారు. ఈ బాధ్యతలన్నింటినీ నెరవేర్చడం కోసం రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కొన్నింటిని గుర్తు చేశారు. దీని ఆధారంగా గత 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేటాయించదగిన పన్ను రాబడి వాటా 41 శాతం పెంపును ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే గత 4 ఏళ్లలో ఈ సిఫార్సుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పన్ను ఆదాయంలో 33.16 శాతం మాత్రమే వస్తున్నట్లు వివరించారు.
సగం వాటా ఇవ్వాల్సిందే..
రాష్ట్రాల కోసం అదనపు పన్నులు , సర్‌చార్జీలు పన్ను విభజనలో చేర్చబడ్డాయని, ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వ వాటాలో తమిళనాడు వంటి రాష్ట్రాల నిధులు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని విరించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్ను పంపిణీ తగ్గింపు కారణంగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు పెనుభారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయంలో రాష్ట్రాలకు పన్నుల వాటా 50 శాతం పంపకం చట్టబద్ధం అని, అందరికీ ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. అందుకే తాము 50 శాతం వాటా కు పట్టుబడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు 50 శాతం పన్ను భాగస్వామ్యాన్ని సిఫార్సు చేయడమే కాకుండా నిర్ధారించడంపై దృష్టి పెడుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య పన్నుల విభజన నియంత్రణలో సమతుల్య విధానం అవసరం అని సూచించారు. తమిళనాడులో సుపరిపాలన కొనసాగుతోందని పేర్కొంటూ, ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న పన్ను భాగస్వామ్య విధానం అభివృద్ధికి అవరోధంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక వనరులను అందించడం ద్వారా ఆ రాష్ట్రాలు తమ అభివృద్ధిని కొనసాగించడానికి వీలుంటుందన్నారు. రాష్ట్రాలకు నిధులు తగ్గించే సి అభివృద్ధిని ఆశించడం సాధ్యమా?, అభివృద్ధి కుంటుపడకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి నిధుల పంపిణీ వ్యవస్థను, భారత దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. మునుపటి నిధుల కమిటీల సిఫార్సులను జాగ్రత్తగా పరిశీలించాలని, వాటిలో లోపాల వల్ల అనేక రాష్ట్రాల్లో ఆశించిన విధంగా వృద్ధి, పురోగతి జరగలేదని స్పష్టమవుతుందన్నారు.
● నాగై అతలాకుతలం
న్యూస్‌రీల్
అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు
పన్నుల విభజనలో సమతుల్య విధానం అవసరం
కేంద్రం తీరుతో కుంటుపడుతున్న రాష్ట్రాల అభివృద్ధి
నివేదికపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
16వ ఆర్థిక సంఘం భేటీలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో మూడు సమస్యలు..
తమిళనాడు మూడు కీలక సమస్యలను ఎదు ర్కొంటుందని ఈ సందర్భంగా వివరించారు. గత కొన్నేళ్లుగా ప్రకృతి తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పెను విపత్తులను ఎదుర్కొంటు న్నట్లు గుర్తు చేశారు. వరదల కారణంగా ప్రజల జీవితం, ఆస్తి, జీవనోపాధితో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు దెబ్బ తింటున్నాయని వివరించారు. ఈ నష్టాలు అధిగమించేందుకు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉందన్నారు. ఇందుకు కేంద్రం నుంచి తగిన నిధులు, సహకారం అన్నది లేకుండా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఇది రాష్ట్ర జనాభా వ్యవస్థలో మార్పునకు కీలకంగా మారిందని వివరించారు. తమిళనాడు ప్రస్తుత జనాభాలో సగటు వయస్సు 36.4 ఏళ్లుగా ఉన్నట్టు గుర్తుచేస్తూ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఇది 38.5 శాతంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు తగ్గ అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, మూడో సమస్య పట్టణీకరణ అని పేర్కొంటూ ఆర్థిక వనరులు, తదితర సవాళ్లను వివరించారు. తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల నమ్మకం, విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధికి భరోసా ఇచ్చే విధంగా ఈ సంఘం సిఫార్సులు చేస్తుందని ఆశిస్తున్నామని , తమిళనాడు ప్రభుత్వం తరపున అందజేసిన నివేదికను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment