నయనతారపై పిటిషన్‌కు ధనుష్ రెడీ
తమిళ సినిమా: నటి నయనతారను కోర్టు బోనులో నిలబెట్టడానికి నటుడు ధనుష్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. నయనతార తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలతో ఓ డాక్యుమెంట్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే దానికి నయనతార బిహైండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరు నిర్ణయించారు. అందులో నటి నయనతారతో దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమ, పెళ్లి వంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా నయనతార నటించిన పలు చిత్రాలలోని ముఖ్య సన్నివేశాలను పొందుపరిచారు. అయితే నయనతార విగ్నేశ్ శివన్‌ల ప్రేమ చిగురించడానికి కారణమైన చిత్రం నానూ రౌడీదాన్. ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తన డాక్యుమెంటరీ వాడుకోవడానికి ధనుష్ ను అనుమతి కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అయినప్పటికీ ఆ చిత్రంలోని సన్నివేశాలను డాక్యుమెంటరీ ట్రైలర్లో వాడారు. ధనుష్ తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడినంతకాలం రూ. 10 కోట్లు నష్టం పరిహారం కోరుతూ నటి నయనతారకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై నయనతార ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌ల డాక్యుమెంటరీని నెట్ ఫిక్స్ సంస్థ సోమవారం స్ట్రీమింగ్ చేసింది. అందులోనూ నానుమ్ రౌడీ దాన్ లోని కొన్ని సన్నివేశాలు చోటు చేసుకోవడంతో ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన వర్గం పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్ర షూటింగ్ కోసం వేరే ఊరిలో ఉన్నారు. ఆయన చైన్నెకి తిరిగి వచ్చిన తరువాత నయనతారపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతారట. అయితే ధనుష్ నటుడుగా దర్శకుడిగా నిర్మాతగా బిజీగా ఉండటంతో ఆయన తరపున ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా నయంతారపై కోర్టులో సిద్ధమవుతున్నట్లు ధనుష్ వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనని నయనతార పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment