●స్కూటీ అదుపు తప్పడంతో ప్రమాదం
అన్నానగర్: కారైకుడి సమీపంలో ఆదివారం రాత్రి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పై నిల్వ ఉన్న వర్షపు నీటిలో పడి ఓ మహిళ ఊపిరాడక మృతి చెందారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని రాస్తా ప్రాంతానికి చెందిన కలైచెల్వి (50) కారైకుడిలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి పని ముగించుకుని స్కూటీ పై ఇంటికి వెళ్తుండగా.. రాస్తా నది వంతెన దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం హెడ్ లైట్ల వెలుగులో రోడ్డు కనిపించలేదు. దీంతో స్కూటీ తప్పి రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీకొట్టింది. గాయాలపాలై స్ఫృహతప్పి పక్కనే ఉన్న కాలువలో నిలిచిన వర్షపు నీటిలో కలైచెల్వి పడిపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. పాదచారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గర్భిణి వద్ద నగలు నగదు చోరీ
తిరువొత్తియూరు: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి వద్ద నగలు, నగదును చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి పుదురుకు చెందిన కమల (65). ఈమె 8 నెలల గర్భం గర్భిణిగా ఉన్న తన కుమార్తెను తీసుకుని గత 7వ తేదీ చైన్నె తండయార్‌పేట ప్రాంతంలో ఉన్న మహిళా ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. ఆ సమయంలో గర్భిణి వద్ద ఉన్న ఆరు సవర్ల బంగారు నగలు, వెండి గొలుసులు, వెయ్యి రూపాయలను ఆ మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి ఆమె వద్ద చోరీ చేశాడు. దీని గురించి ఆ తల్లి ఆమె తల్లి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment