క్లుప్తంగా
నిషేధిత గుట్కా విక్రయించిన వ్యాపారి అరెస్టు
పళ్లిపట్టు: నిషేధిత గుట్కా నిల్వవుంచి విక్రయించిన వ్యాపారిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లాలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయం, అక్రమ రవాణా అరికట్టే విధంగా తిరువళ్లూరు జిల్లా ఎస్పీ శ్రీనవాస పెరుమాళ్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట నిఘావుంచి తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పొదటూరుపేటలోని నగరి రోడ్డు మార్గం కన్నికాపురం వద్ద దుకాణంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను నిల్వ వుంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పొదటూరుపేట ఎస్‌ఐ సుగంతి తన సిబ్బందితో దుకాణంలో సోమవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణంలో నిల్వ వుంచిన నిషేధిత 1250 గ్రాముల గుట్కా పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసి షణ్ముగాన్ని అరెస్టు చేశారు.
దోమల మందు తాగి
ఆత్మహత్యాయత్నం
తిరువొత్తియూరు: నెల వారీ పరీక్షలలో తక్కు మార్కులు వచ్చాయని తల్లి మందలించడంతో 11 తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని దోమల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. చైన్నె సాలిగ్రామం శివాలయం వీధికి చెందిన యువరాజు (45), ఇతని కుమార్తె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో 11 తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాలలో నెల వారి పరీక్షలు తక్కువ మార్కులు పొందడంతో విద్యార్థినిని ఆమె తల్లి తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. దీంతో ఆ బాలిక ఇంటిలో ఉన్న దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు గుర్తించి ఆస్పత్రి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
7 నెలల పాప గొంతులో చిక్కుకున్న తైలం డబ్బా..
● చిన్నారికి అస్వస్థత
అన్నానగర్: చైన్నె సమీపంలో ఉన్న కాంచీపురం జిల్లా మేట్టుపాళయం గ్రామం మేడు ప్రాంతానికి చెందిన అజిత్, డయానా దంపతులు. వీరికి గుగణేష్ అనే 7 నెలల కుమారుడు ఉన్నాడు. ఇతను ఇంట్లో ఆడుకుంటుండగా తల్లిదండ్రులు గమనించని సమయంలో నేల పై పడి ఉన్న తైలం డబ్బా తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు. పిల్లవాడు డబ్బా ఎలా ఉమ్మివేయాలో తెలియక తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. పిల్లవాడి గొంతులోకి వెళ్లి నొప్పిని భరించలేక ఏడవడం ప్రారంభించాడు. బిడ్డ ఎందుకు ఏడుస్తోందని తల్లిదండ్రులు ఆరా తీయగా, చిన్నారి నోటి నుంచి రక్తం కారుతోంది. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చేర్చిన చిన్నారిని వైద్యులు పరీక్షించి చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత డాక్టర్లు చిన్నారిని మెల్లగా పైకి లేపి గొంతుకు, శ్వాసనాళానికి మధ్య బలంగా ఇరుక్కున్న తైలం డబ్బాను లారింగోస్కోప్‌తో బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు.
ఎస్‌ఐ సస్పెన్షన్
కొరుక్కుపేట: గుట్కా కేసును సక్రమంగా విచారించకుండా నిందితులకు సహకరించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశించారు. వివరాలు.. కొద్ది రోజుల క్రితం తేని సుబ్బన్ వీధిలోని ఓ గోడౌనన్‌లో రూ.1. 67 లక్షలు విలువైన నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాగరాజ్ (55), పాండి (65), అమర్ సింగ్ (33)లను అరెస్టు చేశారు. తేని పళనిశెట్టిపట్టి సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇద్రిస్‌ఖాన్ నేతృత్వంలో జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టాలనిఎస్పీ శివప్రసాద్ ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన వ్యక్తిని విడుదల చేసేందుకు పళనిశెట్టిపట్టి ఎస్‌ఐ జగన్ తేని సాయుధ పోలీసుగా బదిలీ అయ్యారు. అలాగే కేసును సక్రమంగా విచారించకుండా ఇద్రీస్ ఖాన్ నిందితులతో టచ్‌లో ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. నేరగాళ్లకు సహకరిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఎస్‌ఐ ఇద్రిస్ ఖాన్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించాలని ఎస్పీ ఆదేశించారు.
నకిలీ బంగారం నగలు తాకట్టు పెట్టి రూ. 11 లక్షలు మోసం
●నలుగురి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె రెడిల్స్‌లో తాకట్టు దుకాణంలో నకిలీ బంగారం నగలు తాకట్టు పెట్టి రూ.11 లక్షలు మోసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు..చైన్నె, రెడిల్స్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తాకట్టు దుకాణంలో నకిలీ బంగారం 25 సవర్లు నగలు తాకట్టు పెట్టి రూ. 11 లక్షల 65 వేలు నగదు తీసుకొని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి రెడిల్స్ సమీపంలోని విలన్గాడు చెందిన రాజాజీ నగర్ కు చెందిన శ్రీధర్ (48), ఎన్నూరు సునామీ నగర్ ప్రాంతానికి చెందిన తంగతురై (42), ఇసక్కిదురై (39), కుమార్ (42) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు హాజరపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment