గ్రామీణ రాజకీయ నేపథ్యంలో పరారీ
రివ్యూలపై
పరారీ చిత్ర యూనిట్
తమిళసినిమా: ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్ సమర్పణలో రూపొందిన చిత్రం పరారీ. కళా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరి శంకర్ నిర్మించి, కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ నటి సంగీత కథా నాయకిగా పరిచయం అయ్యారు. కాగా దర్శకుడు రాజు మురుగన్ శిష్యుడు ఎళిల్ పెరియ వేడు దర్శకుడిగా పరిచయం అయ్యారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రీధర్ ఛాయాగ్రహణం అందించిన పరారీ చిత్రం ఈనెల 22న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడి యా సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు రాజు మురుగన్ మాట్లాడుతూ ఇది తన శిష్యుడు ఎళిల్ పెరియ వేడు దర్శకత్వం వహించిన చిత్రం అనీ, ఈ చిత్రానికి మోరల్ సపోర్ట్ చేయడానికే సమర్పకుడి వ్యవహరించినట్లు చెప్పారు. కథ, దర్శకుడు,ఆలోచన అంతా ఆయనదేనని చెప్పారు. సామాజిక బాధ్యతతో కూడిన గ్రామీణ రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం పరారీ అని పేర్కొ న్నారు. నిర్మాత, కథానాయకుడు హరి శంకర్ మాట్లాడుతూ నిర్మాతగా తనకింది తొలి ప్రయత్నం అని, అందరం కలిసి మంచి చిత్రాన్ని చేశామని భావిస్తున్నానన్నారు. తనకిది తొలి చిత్రం అని నటి సంగీత అన్నారు. తాను మినహా ఈ చిత్రంలో నటించిన వారంతా స్టేజ్ ఆర్టిస్టులని, వారి నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆమె చెప్పారు. చిత్ర దర్శకుడు ఎళిల్ పెరియ వేడు మాట్లాడుతూ తాను గురువు రాజు మురుగన్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదన్నారు. ఎలాంటి అసమానతలు లేకుండా ప్రజలు జీవించాలన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం పరారీ అని పేర్కొన్నారు. చిత్రం తిరువణ్ణామలై నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. దీంతో అక్కడ మూడు నెలలు నటీనటులతో రిహార్సల్స్ చేయించి ఆ తర్వాత షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు.
తమిళసినిమా: సినిమాలపై విమర్శలు (రివ్యూలు)హద్దు మీరుతున్నా యా? విశ్లేషణ పేరుతో కొందరు పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి అదుపు తప్పిన విమర్శలతో చిత్రాలకు ఇబ్బంది కలుగుతుందా ? ఈ ప్రశ్నలకు సినీ ప్రముఖుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల నటుడు రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయన్, సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ వంటి భారీ చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కారణం ఇలాంటి విమర్శలేనని ప్రముఖ సినీ పంపిణీదారుడు, మల్టీప్లెక్స్ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఈయన ఇటీవల ఓ వీడియోలో పేర్కొంటూ కొత్త చిత్రాలు విడుదలై మొదటి షో పూర్తి అయిన వెంటనే యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రేక్షకుల విమర్శలు భయానికి గురిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది విడుదలైన మెగా బడ్జెట్ చిత్రాలకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కారణం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో సినిమాలు విడుదలైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో కొత్త చిత్రాలు ఉదయం 9 గంటల షో తో ప్రారంభమవుతున్నాయని, అయితే ఇతర రాష్ట్రాల్లో వేకువ జామున నాలుగు గంటలకే షోలు మొదలవుతున్నాయి అన్నారు. దీంతో అక్కడి నుంచి ఉదయం 7 గంటలకే సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న విమర్శలు తమిళనాడులో 9 గంటలకు విడుదలవుతున్న చిత్రాలకు ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయన్నారు. కొత్త చిత్రాల గురించి నెగిటివ్ విమర్శలు చేస్తూ యూట్యూబ్ ఛానల్‌ను లబ్ధి పొందవచ్చుననే భావనతో చాలా అడ్డదిడ్డంగా విమర్శల దాడి చేస్తున్నారన్నారని ఆరోపించారు. దీంతో కోట్లు ఖర్చు చేసి చిత్రాలు నిర్మించి చిత్రాలు థియేటర్లకు తీసుకువచ్చే నిర్మాతలకు అలాంటి విమర్శలతో వ్యాపారానికి ముప్పు కలుగుతోందన్నారు. ఇటీవల కేరళలో ఒక నిర్మాత కోర్టులో కేసు వేసి సినీ విమర్శలను కొద్ది రోజులు వాయిదా వేయాలన్న కోరికను వ్యక్తం చేసినట్లు విన్నానని, అదేవిధంగా ఇక్కడ కూడా చిత్రాలు విడుదలైన రెండు వారాల వరకు విమర్శలు రాకుండా నిషేధం విధించాలని కోరికలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ – 2, వేట్టయన్, కంగువ అలాంటి వ్యతిరేక విమర్శల కారణంగా తీవ్ర నష్టం కలిగిందని తిరుపూర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.
తిరుపూర్ సుబ్రమణియన్
Comments
Please login to add a commentAdd a comment