పెళ్లి కళ?
నటి కీర్తి సురేష్‌కు
నటి
కీర్తి
సురేష్
తమిళసినిమా: నటి కీర్తి సురేష్‌కు పెళ్లికళ వచ్చేసిందా ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. 2013లో గీతాంజలి అనే చిత్రం ద్వారా మాతృభాషలో కథానాయకగా పరిచయమైన నటి కీర్తి సురేష్ ఆ తర్వాత రింగ్ మాస్టర్ అనే చిత్రంలో నటించారు. దాంతో కోలీవుడ్ దృష్టి కీర్తిపై పడింది. అలా దర్శకుడు విజయ్ ఆమెను ఇదు ఎన్న మాయం అనే చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించని విజయాన్ని సాధించలేదు. అయితే ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన నటించిన రజిని మురుగన్, రెమో చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత కెరీర్ పరంగా కీర్తి సురేష్‌కు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తెలుగులో నటించిన మహానటి చిత్రం జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అలా మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. అలా దశాబ్దం కాలంలోనే పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఈమె గట్టిగా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథ చిత్రాల గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడీ కేరళ కుట్టి వయసు 32 ఏళ్లు. అయితే చాలా కాలంగానే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరుగానే సాగింది. ముంబాయికి చెందిన ఒక యువ వ్యాపారవేత్తను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారాన్ని ఆమె తండ్రి సురేష్ ఖండించారు. కాగా తాజాగా మరోసారి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. అంతేకాకుండా ఈసారి పెళ్లి కొడుకు పేరు, పెళ్లి వేదిక వంటి విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి . కీర్తి సురేష్ తన 15 ఏళ్ల స్నేహితుడయిన ఆంటోనితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని, కేరళలో పుట్టిన అతను దుబాయ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అయినట్టు, వీరి పెళ్లి ఇరు కుటుంబాల అనుమతితో డిసెంబర్లో జరగబోతున్నట్లు వీరి పెళ్లికి గోవాలోని సుందరమైన ప్రదేశం వేదిక కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కీర్తి సురేష్ తన ప్రేమికుడితో ఉన్న ఫొటోలు ఇప్పుడు సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై నటి కీర్తి సురేష్ కానీ ఆమె తల్లిదండ్రులు గానీ స్పందించకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment