నరువి ఆసుపత్రిలో ప్రాక్టికల్‌ రేడియాలజీపై సదస్సు | - | Sakshi
Sakshi News home page

నరువి ఆసుపత్రిలో ప్రాక్టికల్‌ రేడియాలజీపై సదస్సు

Published Wed, Nov 20 2024 12:41 AM | Last Updated on Wed, Nov 20 2024 12:42 AM

నరువి ఆసుపత్రిలో ప్రాక్టికల్‌ రేడియాలజీపై సదస్సు

నరువి ఆసుపత్రిలో ప్రాక్టికల్‌ రేడియాలజీపై సదస్సు

వేలూరు: ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌, ఇమ్మాజింగ్‌ సంఘం, తమిళనాడు, పుదుచ్చేరి సంయుక్తంగా ప్రాక్టికల్‌ రేడియాలజిపై ఒక రోజు సదస్సు వేలూరు నరువి ఆసుపత్రిలో జరిగింది. ఈ సదస్సుకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నదురై అబ్దుల్లా అధ్యక్షత వహించగా వేలూరు బ్రాంచ్‌ అధ్యక్షులు మదన్‌మోహన్‌ ఆహ్వానించారు. నరువి ఆసుపత్రి చైర్మన్‌ సంపత్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. రాష్ట్ర స్థాయి సదస్సును వేలూరు లో నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్ట ర్లు కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్లోరో నెల్‌సన్‌, వేలూరు సీఎంసీ ఆసుపత్రి డాక్టర్‌లు శ్యామ్‌, శ్రీధర్‌, జిల్లా కోశాధికారి సహాన, డాక్టర్‌ మైకిల్‌ రాజన్‌, అశోక్‌ మిత్ర, డాక్టర్‌లు గురు క్రిష్ణన్‌, ప్రియాంక, కలైఅరసన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement