కొరుక్కుపేట: హత్యాయత్నంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని మళ్లీ చంపేందుకు ప్లాన్ చేసిన జేజే నగర్‌కు చెందిన ఏడుగురు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని యనగౌని ప్రాంతానికి చెందిన నె డుంజేలియన్ అనే వ్యక్తి ఆ ప్రాంతం వీధిలో తాగునీరు కోసం జరిగిన ఘర్షణలో చనిపోయాడు. నెడుంజేలియన్ తమ్ముడు కందన్, అతని సహచరులు కలసి ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం నెడుంజేలియన్ హత్యలో ప్రమేయం ఉన్నవారిని హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో గత ఏడాది కందన్ అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈ నేపథ్యంలో నెడుంజెలియన్ హత్యకేసు లో భాగమైన అన్నానగర్ పశ్చిమ తిరుమంగళం ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్(45)ను జూన్ 14న అన్నానగర్‌లోని తంగం కాలనీ చర్చి సమీపంలో ఏడుగురితో కూడిన ముఠా నరికేసి పరారైంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడంతో శ్రీనివాసన్ బతి కాడు. ఈ ప్రతీకార ఘటనలో ప్రత్యర్థి శ్రీనివాసన్ ప్రా ణాలతో బయటపడడంతో రౌడీలు మళ్లీ రెచ్చిపోయా రు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉందని నిఘా విభాగం పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత జేజే నగర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్ ఖన్నా నేతృత్వంలోని పోలీసు లు ఏడుగురు రౌడీలను జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment