ఏసీబీ అధికారుల తనిఖీ
● తిరుచెంగోడు రవాణా కార్యాలయంలో కలకలం
సేలం : నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో 11 గంటల పాటు అవినీతి నిరోధక శాఖ పోలీసులు జరిపిన దాడిలో రూ.1.42 లక్షల లెక్కల్లో లేని ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4.30 గంటలక నుంచి లంచ నిరోధక పోలీసుల మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ఎల్కాట్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ నుంచి నేరుగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలోని ఇతర గదుల్లో ఉన్న చిన్న మొత్తాలకు జిల్లా రవాణా అధికారి బాధ్యులనే కారణంతో ఇన్‌స్పెక్టర్ భామా ప్రియ వాహనంలోని నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కార్యాలయంలోని బ్రోకర్లు అనుమానాస్పద వ్యక్తులపై సోదాలు చేయగా దొరికిన డబ్బుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుభాషిణి తెలిపారు. తిరుచెంగోడ్ జిల్లా ట్రాఫిక్ అధికారి శరవణన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భామ ప్రియ, బషీర్ అహ్మద్‌లపై కేసు నమోదు చేశారు. ఈ దాడి కారణంగా, ప్రాంతీయ రవాణా కార్యాలయం మంగళవారం పనిచేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment