ఎంతపని చేశావమ్మా..! | - | Sakshi
Sakshi News home page

ఎంతపని చేశావమ్మా..!

Published Wed, Nov 27 2024 8:26 AM | Last Updated on Wed, Nov 27 2024 8:26 AM

ఎంతపని చేశావమ్మా..!

ఎంతపని చేశావమ్మా..!

● కుటుంబ కలహాలతో దారుణం ● ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి గర్భిణి ఆత్మహత్య

సేలం : సేలం జిల్లా వాళప్పాడి సమీపంలో ఇద్దరు ఆడ పిల్లలతో 7 నెలల గర్భిణి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోని నెయ్యమలై సమీపంలోని అక్కరైపట్టి గ్రామానికి చెందిన రైతు రవి (38). ఇతని భార్య మాతమ్మాల్‌(30), కుమార్తెలు మనోరంజితం (7), నీతీశ్వరి (3). మాతమ్మాల్‌ ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు చోటుచేసుకోవడంతో మాతమ్మాల్‌ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఇటీవల వారం రోజుల క్రితం తిరిగి భర్త ఇంటికి వచ్చింది. మళ్లీ భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఈనెల 23వ తేదీ రవి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో ఇరుగుపొరుగున వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య, పిల్లల మృతదేహాలు తన వ్యవసాయ బావి నీటిపై తేలుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న ఏత్తాపూర్‌ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, శవపంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement