చిత్ర నిర్మాణంలోకి విజయ్ అభిమాని
తమిళసినిమా: విజయ్‌కి అశేష సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో జాన్ అమలన్ ఒకరు. విజయ్ అభిమాన సంఘాల తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మోడలింగ్ రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మీడియా వర్క్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇండియన్ అవార్డ్స్ పేరుతో గత మూడేళ్లుగా క్రీడలు, రాజకీయం, పారిశ్రామిక, వైద్యం తదితర రంగాలకు చెందిన నిష్ణాతులను అవార్డులతో సముచితంగా సత్కరిస్తున్నారు. అదేవిధంగా మిస్సెస్ అండ్ మిస్టర్స్ తమిళం పేరుతో అందాల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. డిసెంబర్ 21, 22వ తేదీల్లో చైన్నెలో మూడో ఇండియన్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు సోమవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాన్ అమలన్ మాట్లాడుతూ తాను విజయ్‌కి వీరాభిమానినని చెప్పారు ఆయనకు అవార్డును ప్రదానం చేయాలని ఆశించారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలకు స్వస్తి పలికి రాజకీయ రంగంలోకి ప్రవేశించడంతో అది సాధ్యం కాలేదని అన్నారు. అయితే తాను కోరుకున్న విధంగా విజయ్‌కి ఎప్పటికై నా అవార్డును ప్రదానం చేస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాజాగా లియోనా అండ్ లియో పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా ప్రేక్షకులను అలరించే విధంగా మంచి కథా చిత్రాలను నిర్మించబోతున్నట్లు వివరించారు. ప్రతిభ ఉండి అవకాశాలు రాని కళాకారులను ప్రోత్సహించే విధంగా తమ సంస్థ చిత్రాలు నిర్మిస్తుందని జాన్ అమలన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళ్ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్‌కుమార్, నటి కోమలి శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జాన్ అమలన్కు శుభాకాంక్షలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment