నైల్లెలో యువకుడి హత్య
● ముగ్గురు అరెస్టు
సేలం : నైల్లెలో జిల్లా సుద్దమల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని భారతి నగర్లో ముత్తు కృష్ణన్ (21) అనే యువకుడిని గుర్తు తెలియని ముఠా నరికి హత్య చేసిన ఘటన మంగళవారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృత్తు కృష్ణన్ దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి యత్నించగా బంధువులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం వారు రోడ్డు పై ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి వచ్చిన నెల్లై ఎస్పీ సిలంపరసన్ సర్ధి చెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. తర్వాత ముత్తు కృష్ణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం నైల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సోమవారం రాత్రి మళ్లీ కుటుంబీకులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ను ముట్టడించారు. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment