1000 మందికి సహాయకాల పంపిణీ
తిరుత్తణి: డిప్యూటీ సీఎం ఉదయనిధి 48వ జన్మదినం సందర్భంగా తిరుత్తణిలో మంగళవారం డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో వెయ్యి మందికి సహాయకాలు పంపిణీ చేశారు. తిరువళ్లూ రు వెస్ట్ డీఎంకే యువజన విభాగ కన్వినర్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మంత్రి నాజర్ పాల్గొని చిరు వ్యాపారులకు గొడుగు తో కూడిన వ్యాపారం చేసే ప్లాట్, ఆటో కార్మికులకు యూనిపాం, మహిళలకు చీరలు, పారిశుధ్ద్య కార్మికులు సహా 500 మందికి వివిధ సహాయకాలు అందజేసారు. అనంతరం కల్యాణ మండపంలో 500 మందికి మాంసాహార మధ్యాహ్న భోజనం అందజేశారు. కార్యక్రమంలో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, మాజీ జిల్లా కార్యదర్శి భూపతి, పట్టణ కార్యదర్శి వినోత్కుమార్, సహా డీఎంకే యువజన విభాగ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment