తమిళసినిమా: నేషనల్ క్రష్ గా మారిన నటి రష్మిక మందన్న. శాండిల్ వుడ్ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే కన్నడం, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో నటించే అవకాశాలను పొంది విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో సంచలన విజయాలను పొంది క్రేజీ కథానాయకగా రాణిస్తున్నారు. అలా ఈమెను నటిగా ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టిన చిత్రం పుష్ప అని చెప్పడంలో అతిశ యోక్తి కాదు. కథ తాజాగా ఈమె అల్లు అర్జున్‌తో మరోసారి జత కట్టిన పుష్ప– 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా ఇటీవల చైన్నెలో నిర్వహించిన పుష్ప 2 చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక ముందన్న చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. వారందరికీ రష్మిక ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి ఖుషీ పరిచారు. ఈ సందర్భంగా వేదికపై యాంకర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు బదులిచ్చారు. ముఖ్యంగా ప్రే మ,ప్రేమికు డు వంటి ప్రశ్నలకు చాలా తెలివిగా బదిలిచ్చి అభిమానులతో పాటు, నటుడు అల్లు అర్జున్, నటి శ్రీలీలల నుంచి చప్పట్లు అందుకున్నారు. నీకు భర్తగా వచ్చే వ్యక్తి స్మార్ట్‌గా ఉండాలా రగ్గర్డ్‌గా ఉండాలా అన్న ప్రశ్న కు ఆ రెండు కలిసిన వాడై ఉండాలని చెప్పారు. నీకు కాబో యే భర్త చిత్ర పరిశ్రమకు చెందినవాడా, వేరే రంగానికి చెందిన వాడ అన్న ప్రశ్నకు అందరికీ తెలిసిన విషయమేగా అంటూ చిరునవ్వుతో బదులి చ్చారు. కాగా టాలీవుడ్ నటు డు విజయ్ దేవరకొండ నటి రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్ర చారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రష్మిక విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకుండా నే ఆయనే తన ప్రేమికుడు అని చెప్పకనే చెప్పారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment