కమనీయం.. సీతారాముల కల్యాణం
కొరుక్కుపేట: చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్‌లోని వలంపురి వ్యాస వినాయగర్ ఆలయంలో బుధవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. వందలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీరా మ నామస్మరణ నడుమ శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పేడూరు గ్రామానికి చెందిన వేదగిరి నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మాధవగిరి లక్ష్మీనరసింహమూర్తి, ఆయన శిష్య బృందం విచ్చేసి నూతన పంచ లోహ విగ్రహ ప్రాణప్రతిష్ట పూజలు, హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం శ్రీసీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీకోదండరామ స్వామివారి నూతన పంచలోహ విగ్రహ ప్రాణప్రతిష్ట వైభవోపేతంగా జరిపించారు. నూతన పంచ లోహ విగ్రహ ప్రాణప్రతిష్ట, పూర్వాహుతి, కుంభ ప్రోక్షణ శాంతి కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి ఆరు గంటలకు పైగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సీతారాములను విశేషంగా అలంకరించి, కల్యాణ తంతును చేపట్టారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి సీతారాములను కనులారా దర్శించుకున్నారు. శ్రీరామ నామస్మరణలతో ఎంకేబీనగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. మొలగనూరు విజయకుమార్–సురేఖ, మల్లాపు నారాయణ–సునీత దంపతులు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment