మళ్లీ కలిసి జీవించాలని కోరుకోవడం లేదు
తమిళసినిమా (చైన్నె): నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతుల విషయంలో అందరి అంచనాలు, ఆకాంక్షలు తలకిందులు అవుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లది పెద్దలు నిర్ణయించిన ప్రేమ వివాహం అన్నది తెలిసిందే. వీరి పెళ్లి 2004లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 18 ఏళ్ల సంసార జీవితం గడిపిన తర్వాత ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయి వివాహ రద్దు కోసం చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న రజనీకాంత్ కుటుంబానికి మాయని మచ్చగా మారింది. ఈ విషయంలో నటుడు రజనీకాంత్ తన అల్లుడు కూతుర్లను కలపడానికి చేయాని ప్రయత్నం లేదని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆయన సన్నిహితులు కూడా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ను కలపడానికి విశ్వ ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విడాకుల కేసులో కోర్టుకు హాజరు కావాల్సిందిగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు న్యాయమూర్తి మూడుసార్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టుకు ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ గైర్హాజరు కావడంతో మీరు మళ్లీ కలవబోతున్నారనే ప్రచారం జరిగింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నటుడు రజినీకాంత్ ఇటీవల ధనుష్‌ను తన ఇంటికి పిలిపించి ఆయన సమస్యలను అడిగి తెలుసుకొని, అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌తో కూడా చర్చించినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా గురువారం విడాకుల కేసు వ్యవహారంలో నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో హాజరయ్యారు. దీంతో న్యాయమూర్తి వీరిద్దరిని వేరువేరుగా కలిసి విడాకుల విషయంలో మీరు నిర్ణయం అలాగే ఉందా? లేక మారిందా? అని ప్రశ్నించగా ఇద్దరు ఎలాంటి మార్పు లేదని చెప్పడంతో తదుపరి విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల విషయమై తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment