– మరో 22 రోజుల్లో ముగియనున్న పదవీకాలం
అన్నానగర్: తంజావూరు తమిళ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ను గురువారం పదవి నుంచి తొలగించారు. ఆయన పదవీ విరమణ మరో 22 రోజులు మాత్రమే ఉండగా విధుల నుండి తొలగించబడ్డారు. తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా 13 డిసెంబర్ 2021న తిరువళ్లువన్ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల ఈ పోస్టు పదవీకాలం వచ్చే నెల(డిసెంబర్) 12వ తేదీతో ముగియాల్సి ఉంది. తిరువళ్లువన్ పదవీ కాలానికి 22 రోజులు మిగిలి ఉండగానే గురువారం పదవి నుంచి తొలగించారు. దిండుగల్ గాంధీ విలేజ్ రూరల్ యూనివర్సిటీలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువళ్లువన్ వెళ్లారు. తమిళనాడు గవర్నర్ ఆదేశానుసారం జరిగిన విచారణను దృష్టిలో ఉంచుకుని ఆయన్ను తొలగించినట్లు గవర్నర్ కార్యదర్శి కిర్లోష్కుమార్ సంతకంతో కూడిన లేఖను ఆయనకు అందించారు. ఈ లేఖ కాపీని తమిళ విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయానికి పంపారు. ఆ తర్వాత తిరువళ్లువన్ తమిళ యూనివర్సిటీకి వచ్చి ఆయన సామగ్రి తీసుకెళ్లాడు. గవర్నర్ హౌస్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ పదవిని తొలగించడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment