విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి హెచ్చరించారు. మీ కోసం మీ గ్రామంలో ఒక్కరోజు అనే పథకం కింద వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని రాజపాళ్యం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులకు అందజేసిన ఉదయం టిఫన్‌ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. రుచికరంగా ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జార్థాన్‌కొల్‌లై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేయడంతో పాటు రేషన్ దుకాణానికి చేరుకొని నిత్వావసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా? రోజూ దుకాణం తెరుస్తున్నారా? లేదా? అనే విషయాలను గ్రామస్తుల వద్ద అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్ దుకాణానికి నాణ్యమైన సరుకులు సరఫరా చేస్తున్నారా అనే వాటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీంజమందై, అనకట్టు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట పాటు పంచాయతీ అభివృద్ధి అధికారి జ్ఞానసుందరం, అసిస్టెంట్ ఇంజినీర్ హంస, కార్యానిర్వహణ అధికారి జీవానందం, తహసీల్దార్ వేండా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment