పార్కింగ్ చిత్ర దర్శకుడితో విక్రమ్?
తమిళసినిమా: నటుడు హరీష్ కల్యాణ్ ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పార్కింగ్. దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈగో కాన్సెప్ట్ ప్రధాన ఇతివృత్తంతో రూపొందింది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించిన ఈ. దర్శకుడి తదుపరి చిత్రం ఏంటన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. కాగా తదుపరి శివ కార్తికేయన్ హీరోగా దర్శకుడు రాంకుమార్ బాలకృష్ణన్ చిత్రం చేయబోతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాలలో జోరుగా సాగింది. అయితే ఆ తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాంకుమార్ బాలకృష్ణన్ నటుడు విక్రమ్‌ను కలిసి కథ చెప్పినట్లు, అది ఆయనకు బాగా నచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం త్వరలో పట్టాలేకపోతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని డాన్ ఫిలిమ్స్ సంస్థ ఫస్ట్ కాపీ బేస్‌లో నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తంగలాన్ చిత్రంలో నటి విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం అరుణ్ కుమార్ దర్శకత్వంలో వీర ధీర సూరన్ చిత్రంలో కధానాయకుడిగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం తరువాత విక్రమ్ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment