తిరువొత్తియూరు: తిరువేర్కాడులో ముగ్గురుని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ప్రముఖ రౌడీకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పూందమల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. తిరువేర్కాడు సూర్యనారాయణ నగర్‌కు చెందినవారు ఉదయకుమార్ ఇతని సహోదరుడు సెంథిల్ కుమార్ వీరి స్నేహితుడు వినోద్ కుమార్. వీరిని గత 2013వ సంవత్సరము మార్చి నెల తిరువేర్కాడు కస్తూరిబాయ్ అవెన్యూకు చెందిన రౌడీ శక్తివేల్, దుడ్డు కరత్రో హత్య చేయడానికి యత్నించాడు. దీంతో తీవ్ర గాయమైన ముగ్గురు చికిత్స తర్వాత ఇంటికి తిరిగివచ్చారు. దీని గురించి తిరువేర్కాడు పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేసి శక్తి వేల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ కేసు విచారణ పూందమల్లి అదనపు సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కేసు విచారణ పూర్తి అయిన క్రమంలో న్యాయమూర్తి అలిసియా తీర్పు ఇచ్చారు. నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష , రూ.30 వేలు జరిమానా విధిస్తూ ఆదేశించారు. దీనికి పోలీసు లు రౌడీ శక్తివేల్‌ను పులల్ జైలులో పెట్టారు.
వేలం చీటీ పేరుతో మోసం
– మహిళ సహా నలుగురి అరెస్టు
అన్నానగర్: ఊటీలో వేలం చీటీ పేరుతో రూ.లక్షలు మోసం చేసిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..నీలగిరి జిల్లా, ఊటీ కీళ్ తలైయాట్టు మందు ప్రాంతానికి చెందిన కుమార్ (51). ఇతను, ఇతని భార్య లత (46), కుమారుడు రాహుల్ (23), కుమార్ తమ్ముడు ఆటో డ్రైవర్ సహా దేవన్ (48) కలిసి వేలం చీటీ నిర్వహించారు. చీటీ పాడిన వారికి డబ్బులు ఇచ్చే పనిని కుమార్ భార్య, కొడుకు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.1.50 లక్షల చీటీలో 50 మంది, రూ.1.35 లక్షల చీటిలో 25 మంది, రూ.1.05 లక్షల చీటిలో 35 మంది చేరారు. అయితే చీటీ డబ్బు సరిగ్గా ఇవ్వకపోవడంతో పలువురు ఊటీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. క్రైంబ్రాంచ్ విచారణలో 20 మంది ఇచ్చిన ఫిర్యాదులో రూ.36 లక్షల 35 వేలు మోసపోయినట్లు తేలింది. దీంతో నిందితుడు కుమార్, అతని భార్య, కొడుకు, తమ్ముడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
రూ.3.5 లక్షల
విదేశీ సిగరెట్లు స్వాధీనం
అన్నానగర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఎయిర్ ఏషియా విమానం తిరుచ్చి విమానాశ్రయానికి బుధవారం రాత్రి చేరుకుంది. ఈ విమానంలోని ప్రయాణికుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు రూ.3 లక్షల 46 వేల విలువైన 34,600 విదేశీ సిగరెట్లను బండిల్స్‌లో తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడి వద్ద విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment